అదిరిపోయే ఫీచర్లతో 'గెలాక్సీ నోట్‌ ఎస్‌10 లైట్‌' వచ్చేసింది... - MicTv.in - Telugu News
mictv telugu

అదిరిపోయే ఫీచర్లతో ‘గెలాక్సీ నోట్‌ ఎస్‌10 లైట్‌’ వచ్చేసింది…

January 24, 2020

Samsung.

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్ 10 లైట్‌ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 6 జీబీ, 8జీబీ ర్యామ్‌లతో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ ఫిబ్రవరి 2 నుంచి అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని శామ్‌సంగ్‌ ప్రకటించింది. ఈ ఫోన్ తెలుపు, నలుపు, నీలం రంగులలో లభ్యంకానుంది. కాగా, ఈ ఫోన్ ధర ఇండియాలో రూ.39 వేలు ఉండవచ్చని తెలుస్తోంది.

 

శామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ ఫీచర్లు

 

* 6 జీబీ/8జీబీ ర్యామ్‌ 128 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 

* 5+12+48 మెగా పిక్సల్‌ ట్రిపుల్ రియర్ కెమెరా,

* 32 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం, 

* 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ ప్లే, 

* స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 

* 25W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 

* 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ.