గాలి ముద్దుకృష్ణమ ఇకలేరు - MicTv.in - Telugu News
mictv telugu

గాలి ముద్దుకృష్ణమ ఇకలేరు

February 7, 2018

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం చనిపోయారు. 71 ఏళ్ల ముద్దుకృష్ణమ అర్ధరాత్రి హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన రెండు రోజులుగా తీవ్రమై డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్‌ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జన్మించారు. బీఎస్సీ, ఎంఏ, బీఎల్ చదివారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకునిగా కొన్నాళ్లు పనిచేశారు. ఎన్టీఆర్ పిలుపుతో 1983లో టీడీపీలో చేరారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ హయాంలో విద్య, అటవీశాఖ, ఉన్నత విద్య మంత్రిగా  పనిచేశారు. తర్వాత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుని 2004 ఎన్నికల్లో గెలిచారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ పచ్చపార్టీలో చేరి 2009లె నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడాక, టీడీపీ ఆయనను ఎమ్మెల్సీని చేసింది.

ముద్దకృష్ణమ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలతో స్నేహంగా ఉండేవారు. పలువురు రాజకీయ నాయకులు కేర్ ఆస్పత్రికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్నారు. గురువారం అంత్యక్రియలను ఆయన స్వగ్రామోం నిర్వహిస్తారు.