ఈ ఆటతో ఏం లాభం.. ధోనీ తీరుపై గంభీర్ ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఆటతో ఏం లాభం.. ధోనీ తీరుపై గంభీర్ ఆగ్రహం

September 23, 2020

nvbn

రాజస్థాన్, చెన్నై మధ్య మంగళవారం రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో చెన్నై ఓటమిని మూటగట్టుకుంది. దీనికి ధోనీని నిందిస్తూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అతని ఆట తీరుపై ఆగ్రహంగా ఉన్న సమయంలోనే వీరికి మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా తోడు అయ్యారు. . ధోనీ కెప్టెన్సీ చెత్తగా ఉండటంతో పాటు ఆట కూడా ఏం బాలేదని విమర్శించారు. జట్టు కష్ట సమయంలో ఉన్నప్పుడు కెప్టెన్‌గా ఉన్న ధోనీ ఏడో స్థానంలో రావడం ఏంటని ప్రశ్నించారు. 

బ్యాటింగ్‌ విషయంలో ధోనీ అనుసరించిన తీరును తప్పుబట్టారు. రైనా జట్టులో లేని సమయంలో ఆ స్థానాన్ని కెప్టెన్‌గా ఆయన భర్తీ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు.  కాస్త ముందు వెళ్లి ఉంటే విజయం దక్కేదన్నారు. చివరి నిమిషంలో వెళ్లి హ్యాట్రిక్ సిక్సులు కొట్టినంత మాత్రాన ఏం లాభమని ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత పరుగులకు తప్ప జట్టుకు ఏ విధమైన ఉపయోగం ఇవ్వదని అన్నారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. అతని కంటే ముందు గైక్వాడ్, కరన్‌ను పంపించడం పిచ్చి పనిగా అభివర్ణించారు. ఈ విషయంలో ధోనీ కాబట్టే ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు. 14వ ఓవర్లో స్కోర్ 114/5 వద్ద ఉన్నప్పుడు ధోనీ క్రీజులోకి వచ్చారు. చివరి ఓవర్‌లో వరుసగా సిక్సులు కొట్టినప్పటికీ ఓటమి తప్పలేదు. దీంతో