వీళ్లను ఎంకరేజ్ చేస్తే మీ సొమ్ము ఏం పోతుంది..? - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్లను ఎంకరేజ్ చేస్తే మీ సొమ్ము ఏం పోతుంది..?

July 11, 2017

ఆట ఆటే..గేమ్ ఏదైనా అంతే. రూల్స్ , ఫార్మాట్స్ డిఫరెంట్ గా ఉన్నా..అన్ని ఆటల్లో మజా సేమ్. ఆటల్లో క్రికెట్ కున్న క్రేజీ దేనికి లేదు. ఆ తర్వాత స్థానం హాకీది. ఈ రెండింటిలో ప్యాడ్స్ కట్టుకునే ఈ క్రికెటర్లని ఫ్యాన్స్ గాడ్స్ లా చూస్తుంటారు. కొంతలో కొంత హాకీ ప్లేయర్లను ఇంతే.. మరి మహిళా క్రికెట్ , మహిళా హాకీని ఎందుకు చూడపోలేకపోతున్నారు. మగాళ్లు ఆడితే జేజేలు, కేరింతలు..అదే ఆడోళ్లు అంతా సైలెంట్. ఫ్యాన్స్ నుంచి మీడియా దాకా అంతే..ఎందుకిలా..?

భారత మహిళా క్రికెట్ ను చూస్తే వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్. సూపర్ ఫెర్మామెన్స్ తో అదరగొడుతున్నారు. ప్రపంచం కప్ ని సైతం తెచ్చారు..తెస్తూనే ఉన్నారు. ఎన్నో సంచలన విజయాలు..మరెన్నో రికార్డులు..కానీ ఎవరూ వీళ్ల ఆటను చూడరు.మీడియా కెమెరా అటు వైపు అస్సలు చూడదు. ప్రపంచ కప్ లో ఆడోళ్లు గెలిచినా..ఆ ఏముందేలే అంటారు. ఎంకరేజ్..కవరేజ్ ఉండదు. తప్పక తప్పదనుకుని ఇచ్చినా అంతంతమాత్రమే.

అదే మగాళ్లు.. అదే క్రికెటర్లతే… ఏ చిన్న కప్ గెలిచినా..ఆడు మగాడ్రా బుజ్జీ అని ఎవరెస్టు ఎక్కిస్తారు.ఆట మొదలవ్వక ముందు నుంచే ముందు రోజు నుంచే ఎక్కడలేని హడావుడి.. ఇండియా గెలుస్తుందా..ప్లస్ పాయింట్స్ ఏంటీ..గ్రౌండ్స్ కలిసోస్తుందా..ఏ ప్లేయర్ ఎలా అని విశ్లేషణలతో గ్రౌండ్ కు వెళ్లకపోయిన గ్రౌండ్ రిపోర్ట్స్ తో మీడియా సెంచరీ కొట్టేస్తోంది. జనాల్ని అటు అంతగా తీసుకెళ్తుంది. ఫ్యాన్స్ ని పిచ్చేక్కిపోయేలా చేస్తోంది. మరి అదే ఆడవాళ్ల విషయంలో ఎందుకు చిన్న చూపు.. అంటే వాళ్ల ఆటలకు క్రేజ్ లేదా..? కవరేజ్ చేస్తూ ఎంకరేజ్ చేయకపోవడానికి కారణాలు ఏంటీ..?

హాకీ వుమెన్స్ ఇండియా . మహిళా కబడ్డీ టీమ్స్ పరిస్థితి ఇంతే.. ఎన్ని కప్పులు కొట్టినా..సంచలన విజయాలు సాధించినా దేశం పట్టించుకోదు..అందునా మగోళ్లు..మీడియా మరీను. ప్రభుత్వం కూడా ఇంతే..నజరానాలు వాళ్లకే ఎక్కవ.

ఆడోళ్ల మ్యాచ్ లను దేకరు..దేకిన ఒకరిద్దరే.షేర్ చేసుకోవడానికి మరొకడు ఉండడు..దొరికినోడ్ని పట్టుకుని చెబుతుంటే ఇదంతా సోది .నాకెందుకులే అంటాడు. పాపం మహిళా టీమ్స్ అభిమాని హార్ట్ అవుతాడు. అలా చూసే ఒకటి , రెండు మ్యాచ్ లను చూడటం ఆపేస్తాడు..అందుకే అందిరిలా మగా క్రికెట్ జిందాబాద్ అంటాడు. వాళ్లతో కలిసి పనికిరాని డిస్కషన్స్ చేస్తాడు. ఎనలిస్టులకన్నా ఎక్కువ చర్చిస్తారు.

లేడీస్ లేడీస్ ఆటను చూసి ప్రోత్సాహిస్తారా అంటే అదిలేదు..మగాళ్ల మాయలో వారు పడి కొట్టుకుపోయ్యారు. వాళ్ల ఆటకే జేజేలు కొడితూ ఉన్నారు. వీళ్ల ఆటను చూడాలని ఉన్నా..సమయం, తీరిక అంతకుమించి ఇంట్లో రిమోట్ దొరకదు. దొరికిన సీరియల్సే ఫస్ట్ ప్రయారిటీ.. లేకపోతో ఇంటి పనుల్లో హడావుడి.

ఆడోళ్ల ఆటల్ని సమానంగా చూడకపోతే తప్పంతా సభ్య సమాజనిదే. అవును ముమ్మాటికీ సభ్య సమాజానిదే. చూడచక్కగా చక్కనమ్మలు ఆడుతుంటే ఎంకరేజ్ చేయరు..మగోళ్లకు జై కొట్టినట్టు వీళ్లకు ఎందుకు కొట్టడం లేదు..? ఆట ఆటే..మజా మజాయే ఉన్నప్పుడు..ఇందులో ఈ వివక్ష ఎంట్రా నాయనో.. అదే టెన్నిస్ అయితే సొంగ కార్చుకుంటూ చూస్తారు. అర్థం కాకపోకయినా టీవీకి అతుక్కు పోతారు..మీడియా పీపుల్స్ కు ఈ గ్లామర్ గేమ్ అంటే ఇంట్రస్టే .అందుకే గేమ్ కు ముందు గేమ్ తర్వాత స్టేటస్ ను సూపర్ కవర్ చేస్తారు. ఈ విషయంలో వ్యూయర్..రిపోర్టర్ ను మెచ్చుకోవాల్సిందే. మరి అదే మహిళా క్రికెటర్లను , మహిళా హాకీ ప్లేయర్లు,,మహిళా కబడ్డీ ప్లేయర్లను ఎందుకు ప్రొత్సాహించడం లేదు అనేదే ప్రశ్న.

ఆడ పిల్లంటే వివక్ష..ఇదే క్రీడల్లోనూ కనిపిస్తోంది. దీన్ని తుంచేయాలి..వీళ్ల ఆటలకు ప్రచారం కల్పించాల్సిన బాధ్యత సర్కార్ పై ఉంది. ఆటలో వివక్ష వద్దంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ గా మీడియా క్యాంపెయిన్ చేయాలి. మగాళ్ల అంటే క్రికెట్ పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఆడోళ్ల క్రికెట్ లోనూ అసలు సిసలైన మజా ఉందని గుర్తించాలి.

ఇప్పటికైనా ఈ వివక్ష ను వదిలేయండి. అన్ని ఆటల్లో ఉన్నదే వీరి ఆటల్లో ఉంది. ఇంకా చూసే కళ్లతో చూస్తే ఎక్స్ ట్రా మజా కూడా ఉంటుంది. జర చూడండయ్య బాబూలు..వాళ్లను ఎంకరేజ్ చేస్తే మీ సొమ్ము ఏం పోతుంది…