Gandam Gattekkina hit 2.. Adivi sesh out of danger
mictv telugu

గాడ్ ఫాదర్ సైతం చతికిలపడితే.. అడివి శేష్ అవలీలగా దాటేశాడు

December 5, 2022

 

విశ్వక్ సేన్, శైలేష్ కోలానుల క్రైమ్ వరల్డ్ హిట్ మూవీ. కరోనా టైంలో మొదటి కేసుగా విడుదలై సంచలన విజయం దక్కించుకుంది. అయితే సెకండ్ కేసుగా హిట్2 తాజాగా విడుదలై పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తుంది. యంగ్ సెన్సేషన్ హీరో అడివి శేష్ ఈ చిత్రంతో హ్యటిక్ హిట్ కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి షో నుండే హిట్ 2 కి హిట్ టాక్ రావటంతో నిర్మాత నాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హిట్ 3 కూడా ఉంటుందని.. అందులో నానినే హీరో అంటూ వార్తలొస్తున్నాయి. అయితే మొన్న శుక్రవారం థియేటర్లలో విడుదలైన హిట్ 2 ది సెకండ్ కేస్ సినిమా మూడు రోజుల్లో (శుక్ర‌, శ‌ని, ఆది వారాల్లో) థియేటర్స్ ద‌గ్గ‌ర మంచి వసూళ్లను రాబట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వ‌సూళ్ల‌ను పరిశీలిస్తే.. తొలి రోజున రూ.4.03 కోట్లు షేర్ రాగా.. రెండో రోజున రూ.3.28 కోట్లు వస్తే మూడు రోజున రూ.3.20 కోట్లు వచ్చాయి.

అంటే మూడు రోజుల‌కు క‌లిపి హిట్ 2కి 10.51 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ రాగా.. 17.10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియాలో రూ.1.20 కోట్లు వచ్చాయి. ఇక ఓవ‌ర్ సీస్‌లో రూ.3.20 కోట్లు కొల్లగొట్టి వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.14.91 కోట్లు షేర్స్ రాబట్టగా.. 26.20 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే హిట్ 2 మూవీ ఇండియాలో 15కోట్లకి బిజినెస్ జరిగింది. ఇప్పటికే విడుదలైన మూడు రోజులకే హిట్ 2 చిత్రం 10.51 కోట్ల షేర్స్ వచ్చేసాయి. అంటే ఇంకో నాలుగున్నర కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి అడుగేస్తుంది హిట్ 2. అయితే ఇప్పుడున్న దూకుడుతో ఈ లెక్కలను దాటడం ఏమంత కష్టం కాదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ వీక్ డేస్ లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ క్రాస్ అయ్యి.. హిట్ 2కి సెకండ్ వీకెండ్ లో లాభాలు పక్క అంటున్నారు. ఇక సెకండ్ వీకెండ్ తరువాత కూడా క్రేజ్ కంటిన్యూ అయితే భారీ లాభాలు సైతం గ్యారెంటీ అంటున్నారు. ఏదేమైనా హిట్ టాక్ వచ్చిన గాడ్ ఫాదర్, యశోద వంటి బడా స్టార్ మూవీస్ కూడా బ్రేక్ ఈవెన్ కాలేక చతికిల పడితే అడివిశేష్ మాత్రం భారీ హిట్ దిశగా దూసుకెళ్తున్నారు.