గాంధీ ఆస్పత్రిలో వీకెండ్ పార్టీ..ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీ ఆస్పత్రిలో వీకెండ్ పార్టీ..ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి

May 18, 2020

Gandhi Hospital Employees Liquor Party

కరోనా వ్యాధి నివారణకు కేంద్రంగా మారిన గాంధీ ఆస్పత్రిలో నిఘా కరువైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత శనివారం రాత్రి ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సెల్లార్‌లో మందు పార్టీ చేసుకున్నట్టుగా తేలింది. ఎవరికి తెలియకుండా జరిగిన ఈ తతంగం, ఓ ఉద్యోగి ఆకస్మిక మరణంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఏం జరిగిందనే కోణంలో విచారణకు ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. 

ఇటీవల ముగ్గురు ఉద్యోగులు ఆస్పత్రి ప్రాంగణంలోకి మద్యం తీసుకెళ్లి సెల్లార్‌లో పార్టీ చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఎవరికి వారు ఇళ్లకు వెళ్లిపోయారు. తీరా ఆ ముగ్గురిలో ఎ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో మందు పార్టీ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి ఆర్ఎంఓ వెల్లడించారు. ఇంత జరిగినాఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.