అంతా దేవుడిదే భారం అంటున్న డాక్టర్లు...! - MicTv.in - Telugu News
mictv telugu

అంతా దేవుడిదే భారం అంటున్న డాక్టర్లు…!

July 25, 2017

దేవుడు ప్రాణం పోస్తాడు…డాక్టర్ ప్రాణం నిలబెడతాడు అని అంటారు కానీ..ప్రాణాలు నిలబెట్టాల్సిన డాక్టర్లే   ప్రాణాలు కాపాడమని హోమాలు చేసి అంతా దేవుడిదే భారం అంటే ఎలా ఉంటుంది?సైన్స్ ని నమ్ముకున్న డాక్టర్లే మూఢనమ్మకాలు, వాస్తు దోషాలను నమ్మితే ఎలా ఉంటుంది?సర్జరీలు జరగాల్సిన చోట పూజలు జరిగితే ఎలా ఉంటుంది?స్టెతస్కోప్‌తో రోగి గుండెచప్పుడు వినాల్సిన డాక్టర్లు.. మంత్రాలు వింటూ హోమగుండం దగ్గర రోగుల ప్రాణాలు కాపాడమని భక్తితో దేవున్ని కొలిస్తే ఎలా ఉంటుంది?ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన అన్కునెరు, హైద్రాబాద్ నగరంలో ఉన్న  గాంధీ ఆసుపత్రిలో జరిగింది,సర్జరీలు చెయ్యాల్సిన డాక్టర్లందరూ మృత్యుంజయ హోమంను దగ్గరుండి జరిపించారు.

గాంధీ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ విభాగంలో  మృత్యుంజయ హోమం డాక్టర్లు దగ్గరుండి జరింపించడం చర్చనీయ అంశం అయ్యింది,గత కొంత కాలంగా ఆసుపత్రిలో నమోదవుతున్న తల్లీ బిడ్డల మరణాలకు వాస్తు దోషమే కారణమని ఎవరో  చెబితే…డాక్టరందరూ కలిసి  హోమాన్ని చేయించారు,హోమం చెయ్యడంలో తప్పులేదు..కానీ  మూడనమ్మకాలపై  ప్రజలను చైతన్య పరచాల్సింది పోయి ఇలా అంతా దేవుడికే  తెలుసు ..అంతా దేవుడిదే భారం అన్నట్టు డాక్టర్లు  పూజలు చెయ్యడంపై…కొన్ని చోట్ల  విమర్శలు వెల్లువెత్తున్నాయి.అంటే రేపు  రేపు  వీళ్ల తప్పిదాల వల్ల  వైద్యంలో ఏదన్న పొరపాటు జరిగినా..అంతా వాస్తు దోషం,ఆ పైవాడి లీల అని వాళ్లను వాళ్లు సమర్ధించుకుంటారా…అని కొందరు ప్రశ్నిస్తున్నారు.