గాంధీకి ఒక గుడి.. చిట్యాలలో ఘనంగా నివాళి - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీకి ఒక గుడి.. చిట్యాలలో ఘనంగా నివాళి

January 30, 2018

జాతిపిత మహాత్మాగాంధీకి దేశవ్యాప్తంగా విగ్రహాలు ఉన్నాయి. ఆయన పేరుతో ఎంతో ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఉన్నాయి. ఆయనను సాక్ష్యాత్తూ దైవంగా భావించే ప్రజలు ఇప్పటికీ దేశంలో కోట్లమంది ఉన్నారు. గాంధేయులు తమ నేత ఆశయాల ప్రచారం ఆయనకు గుళ్లు కట్టారు.

అలాంటి ఒక గుడి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఉంది. గాంధీ 70వ వర్ధంతి సందర్భంగా అక్కడ మంగళవారం ఘనంగా నివాళి అర్పించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇత్తడి తోరణంతో అలంకరించిన  జాతిపిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇండియా ఆన్ మూవ్ సంస్థ అధినేత, ఆచార్య అజిత్ కుమార్ ప్రార్థనలో పాల్గొని, నివాళి అర్పించారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలోని మహాత్ముని జీవిత విశేషాలను తెలిపే ఫోటో గ్యాలరీని తిలకించారు. ధ్యాన మందిరంలో విద్యార్థులతో కలిసి కాసేపు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం పురోగమించాలంటే గాంధీమార్గమే సాధనమన్నారు. ఆశాంతి, తీవ్రవాదం, దోపిడితనం, దౌర్జన్యాలు పెచ్చరిల్లుతున్నాయని, గాంధేయవాదంతో వీటిని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఇండియా ఆన్ మూవ్ సంస్థ ప్రతినిధులు, స్థానిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.