జాతిపిత కళ్లద్దాలు వేలం.. ధర ఎంతంటే?  - MicTv.in - Telugu News
mictv telugu

జాతిపిత కళ్లద్దాలు వేలం.. ధర ఎంతంటే? 

August 10, 2020

Gandhi's glasses left hanging out of an auctioneer's letterbox....

జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన ఏ వస్తువు అయిన భారతీయులకు అపురూపమే. ఎంత ఖర్చు చేసైనా వాటిని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో గాంధీజీ వినియోగించిన బంగారు పూత పూసిన వృత్తాకారంలో ఉండే కళ్ళద్దాలు కొనుకోలు చేసే అవకాశం వచ్చింది. ఈ కళ్ళద్దాలు త్వరలో యునైటెడ్ కింగ్ డంలో వేలానికి రానున్నాయి. గాంధీ ఈ రకం కళ్లద్దాలను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే వాడారు. ఈ కళ్ళద్దాను గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు వినియోగించారని తెలుస్తోంది. 

ఈ కళ్ళద్దాలను 1910 నుండి 1930 కాలంలో సౌత్ ఆఫ్రికాలోని బ్రిటిష్ పెట్రోలియంలో పని చేస్తున్న తన అంకుల్ కు తన తండ్రి ఇది గిఫ్ట్ ఇచ్చినట్లు ప్రస్తుతం దీనిని పొందిన ఒక విక్రయదారుడు తెలిపాడు. ప్రస్తుతం అతను ఈ కళ్ళద్దాలను వేలం వేసి కొంత డబ్బు సమకూర్చుకుంటానని తెలిపాడు. ఈ క్రమంలో ఈ కళ్ళద్దాలు వేలంలో దాదాపు పదివేల పౌండ్ల ధర పలుకుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ బిడ్ లోనే ఆరు వేల పౌండ్లు పెట్టి దీనికోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కళ్ళద్దాలు వేలంలో ఎవరైనా భారతీయులే కొని మన ప్రభుత్వానికి బహుమతిగా ఇస్తే బాగుండు అని నెటిజన్లు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.