గండిపేట నిండిపోయింది.. ప్రజలకు హైఅలర్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

గండిపేట నిండిపోయింది.. ప్రజలకు హైఅలర్ట్ 

October 21, 2020

హైదరాబాద్ శివారులోని గండిపేట చెరువు(ఉస్మాన్ సాగర్) నిండుకుండలా మారింది. నగర ప్రజలకు తాగునీరు అందిస్తున్న ఈ చెరువుకు పైనుంచి వరద పోటెత్తుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా… ప్రస్తుతం 1787.50 అడుగుల నీరు చేరింది. 888 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 

చెరువు ఏ క్షణంలోనైనా మరింత నిండే అవకాశముంది, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్ర్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.  పదేళ్ల అనంతరం గండిపేట పూర్తిగా నిండుతోంది. గేట్లను తెరిస్తే కొన్ని ప్రాంతాల్లో నీరు చేరుతుందని అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచిరేవుల, నార్సింగి, హైదర్షాకోట్ తదితర ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని కోరుతున్నారు. గండిపేట చెరువు వద్దకు సందర్శకులు రాకుండా పోలీసులను మోహరించారు. 1908నాటి వరదల తర్వాత మూసీ ధాటిని తగ్గించి, నగరానికి మంచినీళ్లు అందించడానికి నదిపై కట్ట కట్టారు. దీన్నే గండిపేట చెరువు అంటారు.