గోదావరి నీటిని తీసుకెళ్లి కావేరీలో పోస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

గోదావరి నీటిని తీసుకెళ్లి కావేరీలో పోస్తాం

November 24, 2017

కృష్ణ, గోదావరి నదుల నీటి పంపకంపై మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు గొడవ పడుతోంటే కేంద్రం ఈ వ్యవహారంలోకి తమిళనాడునూ లాగింది. గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఇందుకోసం  గోదావరి నదిని కావేరి నదితో అనుసంధానిస్తామని చెప్పారు. నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని రూపొందిస్తామన్నారు. గోదావరి నీటిని కృష్ణా, పెన్నా నదుల ద్వారా కావేరి నదికి తరలిస్తామన్నారు.  తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు రుతుపవనాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయని వాటికి, ఇతర నదుల నుంచి నీరివ్వాల్సిన అవసరముందన్నారు. ప్రతి ఏటా గోదావరినుంచి 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మంత్రి మాటలు అతిశయంగా ఉన్నాయని  విపక్ష కాంగ్రెస్ మండిపడింది. ఢిల్లీలో ఐదారు నెలలుగా ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులను బుజ్జగించేందుకే ఈ ప్రకటన చేశారని పేర్కొంది. నదుల అనుసంధానం గురించి మూడున్నరేళ్లుగా మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది.