85 కిలోలు  తగ్గిండు..ఆయన గ్రేట్..! - MicTv.in - Telugu News
mictv telugu

85 కిలోలు  తగ్గిండు..ఆయన గ్రేట్..!

July 20, 2017

అతను బాలీవుడ్ లో పెద్ద కొరియో గ్రాఫర్…ఆయనే  గణేష్ ఆచార్య, పేరు తగ్గట్టుగానే  బొజ్జ గనపయ్యలాగా భారీగా ఉండేవాడు,కానీ ఇప్పుడు చూస్తే ఎలా తయారయ్యాడంటే..  చూసినోళ్ళందరూ..ఇదేదో గ్రాఫిక్స్ మాయా అన్కుంటరు,ఏకంగా 200 కిలోల నుంచి 115 కిలోలకు వచ్చిండట అంటే 85 కిలోలు తగ్గిండన్నట్టు,వామ్మో 85 కిలోలంటే శిన్న ముచ్చట్నా ..గిన్ని కిలోలు తగ్గనికి  దగ్గరి దగ్గర 18 నెలలు పట్టిందట,మరి ఏం ఏం ఎక్ససైజులు జేశిండో….కొవ్వుపెరిగే  వస్తువులు ఏం ఏం తినుడు బంజేశిండో గనీ  మొత్తంమీద బరవు తగ్గనీకి బాగనే కష్టపడ్డడట,తను ఏం ఏం ఎక్సర్ సైజులు జేశింది బరువు ఎట్ల తగ్గింది మొత్తం వీడియోగుడ పెట్టిండు నెట్టుల..భారీ కాయమున్నప్పుడే  గీ డ్యాన్స్ మాస్టర్  డ్యాన్సుల దుమ్ములేపిండు,ఇగ ఇప్పుడు స్లిమ్ అయ్యి ఫిట్ గ అయ్యిండంటే…డ్యాన్స్ కు దడ పుట్టిస్తడేమో,ఆ నడుమ అదాన్ సమీ అనేటాయ్న గుడ గిట్లనే తగ్గి స్లిమ్ గ తయారైతె ఆయన్ను  చాలామంది గుర్తే పట్టలేరు.నిజంగ బరువు తగ్గాలని మన్సుల గట్టిగ అన్కుంటే  ఖచ్చితంగా తగ్గుతరనేదాన్కి గీళ్లే నిదర్శనం.