రేపు గణేష్ నిమజ్జనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు, కొలనులు ఇలా..
వినాయక నిమజ్జనం సందర్భంగా రేపు హైదరాబాద్ నగరం అత్యంత సందడిగా మారనుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌పై జనాలు బాగా గుమికూడుతారు. ఈ క్రమంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో రేపు వినాయక నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అడిషనల్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 18 కిలో మీటర్ల మేరకు శోభాయాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు. 17 ప్రధాన రహదారుల్లో ఈ యాత్ర ఉంటుందని అన్నారు.
అలియాబాద్, నాగుల చింట, చార్మినార్, మదీనా, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర జరుగుతుందని వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. శోభాయాత్రలో ప్రైవేట్ వాహనాలకు అనుమతించమని, ప్రతి ఒక్కరూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించుకోవాలని అన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఆయా మార్గాల్లో ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. 13 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టంచేశారు. శంషాబాద్‌కు వెళ్లే విమాన ప్రయాణికులు, ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన్నారు. 13వ తేదీ ఉదయం కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తామని, ట్యాంక్‌బండ్‌పై ఆరోజు ఒక వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తామని తెలిపారు.
పార్కింగ్ ప్లేసులు ఇలా..
వినాయక నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ సందర్భంగా పది పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్, కట్టమైసమ్మ ఆలయం, ఆనంద్ నగర్ కాలనీ, గోసేవ సదన్, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధ భవన్ వెనుక, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియంలలో పార్కింగ్‌కు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
పూర్తి అయిన నిమజ్జన కొలనులు ఇలా..
ఊరచెరువు, కాప్రా
చర్లపల్లి ట్యాంక్ - చర్లపల్లి
అంబీర్ చెరువు - కూకట్‌పల్లి
పెద్ద చెరువు- గంగారం, శేరిలింగంపల్లి
వెన్నల చెరువు - జీడిమెట్ల
రంగధాముని కుంట - కూకట్‌పల్లి
మల్క చెరువు - రాయదుర్గ్
నలగండ్ల చెరువు - నలగండ్ల
పెద్ద చెరువు - మన్సూరాబాద్ సరూర్‌నగర్
హుస్సేన్‌సాగర్ లేక్, సికింద్రాబాద్
పెద్దచెరువు-నెక్నాంపూర్
లింగంచెరువు-సూరారం
ముళ్లకత్వచెరువు-మూసాపేట్
నాగోల్‌చెరువు
కొత్తచెరువు-అల్వాల్
నల్లచెరువు-ఉప్పల్
పత్తికుంట-రాజేంద్రనగర్
బోయిన్‌చెరువు-హస్మత్‌పేట్
గురునాథ్‌చెరువు-మియాపూర్
గోపిచెరువు-లింగంపల్లి
రాయసముద్రం చెరువు- రామచంద్రాపురం
కైదమ్మకుంట-హఫీజ్‌పేట్
దుర్గంచెరువు-రాయదుర్గ్