గణేశ్ నిమజ్జనానికి డప్పు కొట్టలేదని దళితులపై దాడి
Editor | 10 Sep 2019 8:59 AM GMT
గణేశ్ నిమజ్జనానికి డప్పులు వాయించలేదని దళితులపై అగ్రవర్ణాలు దాడికి పాల్పడ్డాయి. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడతో పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లా కంచనహళ్లిలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి గణేశ్ నిమజ్జనం సందర్భంగా డబ్బు కొట్టడానికి దళితులు నిరాకరించారు. ఆ పని చేయడం తమకిష్టం లేదన్నారు. దీంతో వక్కళిగ సామాజిక వర్గానికి చెందిన వారు.. దళితులను దూషించి దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘చుట్టుపక్కల గ్రామాల్లో ఈ పద్ధతి లేదు. మా పూర్వీకులు ఆ పని చేస్తే చేశారు. మేమెందుకు చెయ్యాలి? మా ఇష్టప్రకారం జీవించే హక్కు మాకులేదా?’ అని దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరసింహస్వామి ప్రశ్నించారు. పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేశారు.
Updated : 11 Sep 2019 2:20 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire