Home > క్రైమ్ > పాఠశాలలోనే పదోతరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, హత్య..!!

పాఠశాలలోనే పదోతరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, హత్య..!!

యూపీలో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై స్కూల్ మేనేజర్, స్టోర్ట్స్ టీచర్ సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందికి తోసేశారు. దీంతో ఆ బాలిక అక్కడిక్కడే మరణించింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో శనివారం మధ్యాహ్నం భారీ పోలీసులు బలగాల సమక్షంలో బాలిక మ్రుతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసుల సమక్షంలోనే అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరణించిన కుమార్తెకు ఆమె తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.

పూర్తి వివరాల ప్రకారం…అయోధ్యలోలోని cbseబోర్డుకు అనుబంధంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఊయల నుంచి పడి విద్యార్థిని మరణించిందని స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో స్కూల్ భవనం నుంచి కిందికి పడినట్లు నమోదు అయ్యింది.

బాలిక మరణంపై ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వేసవి సెలవుల కోసం పాఠశాలను మూసివేసిన తర్వాత కూడా ప్రాధానోపాద్యాయుడు రష్మీ బాటియా తన కూతురును పిలిచారని..ఉదయం తొమ్మిది గంటలకు ప్రిన్సిపాల్ తనకు ఫోన్ చేసి..తమ కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయని చెప్పారని పేర్కొన్నారు. తాను పాఠశాలకు చేరుకునేలోగా తమ బిడ్డను ఆసుపత్రికి తరలించారని ఆమె చెప్పినట్లు తెలిపారు. బాలిక శరీరంపై గాయాలు, ఇతర గుర్తులు ఉన్నాయని…ఊయల నుంచి పడిపోతే ఇలాంటి గాయాలు కావాలని…తమ బిడ్డను హత్య చేశారని తండ్రి ఆరోపించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విద్యార్థినిపై టీచర్, స్టోర్ట్స్ టీచర్ అత్యాచారం చేశారని…ఈ విషయంలో వెలుగులో కి రాకుండా…భవనంపై నుంచి తోసేశారు. ఈ ఘటనలో వీరిద్దరి అదుపులోకి తీసుకున్నారు.

Updated : 27 May 2023 6:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top