Gang rape of woman after drinking gungi medicine in tea, death of husband after seeing photos and videos,
mictv telugu

భార్యపై అత్యాచారం చేసి భర్తకు వీడియో….చివరికి..

November 23, 2022

మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామాంధుల చేతిలో ఆడవాళ్ల జీవితాలు బలైపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా దారుణాలకు అడ్డుకట్టపడట్లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆ వీడియాను భర్తకు పంపారు. ఇది చూసిన భర్త అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

జల్నా జిల్లాలోని పింపల్గామ్ గ్రామంలో దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్త చిరు వ్యాపారి కాగా.. మహిళ ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. వారి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చుట్టుపక్కల వారు రవి దత్తాత్రేయ అనే వ్యక్తిని కలిస్తే వ్యాపారానికి పెట్టుబడి పెడతారని సూచించారు. దీంతో ఆమె రవి దత్తాత్రేయ కాల్ చేసి మాట్లాడింది. ఈ క్రమంలో ఆమెతో అతడికి పరిచయం ఏర్పడింది. కొన్నిసార్లు ఆమెను లొంగదీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించేవాడు. ఇప్పుడు మరోసారిఆమెకు మత్తుమందు ఇచ్చి తన అనుచరులతో కలిసి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అత్యాచార వీడియోలను రికార్డు చేసి నేరుగా ఆమె భర్తకు పంపించాడు. దీనిని చూసిన ఆమె భర్త పరువు పోతుందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.