మృగాళ్ల ఘాతుకం.. బాలిక మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మృగాళ్ల ఘాతుకం.. బాలిక మృతి

October 30, 2017

పంజాబ్‌లో సామూహిక అత్యాచారానికి గురైన 16 ఏళ్ల బాలిక మూడు రోజులు నరకయాతన అనుభవించి కన్నుమూసింది. తీవ్ర గాయాలు, రక్తస్రావంతో ఆమె సోమవారం ఉదయం చనిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు.

ఫలిజ్కా జిల్లాలో ఈ దారుణం జరిగింది. నాలుగు రోజుల కిందట జలాలాబాద్ స్కూలు నుంచి ఇంటికి వస్తున్న ఆమెను మోటార్ సైకిళ్లపై వచ్చిన ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పొలంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. ఆమె కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతగ్గా చివరికి పొలంతో కనిపించింది. తన స్కూల్లో చదివే ఒక మైనర్ బాలుడు సహా ముగ్గురు తనపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.