జ్యుయెలరీ షాపులోకి కారులో దూసుకెళ్లి మరీ దోపిడీ.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

జ్యుయెలరీ షాపులోకి కారులో దూసుకెళ్లి మరీ దోపిడీ.. (వీడియో)

January 17, 2020

London.

కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు కొందరు కేవలం నగల దుకాణాలనే టార్గెట్ చేస్తుంటారు. కెమెరాలు ఉన్నా గప్‌చుప్ గా పనికానిచ్చేస్తుంటారు. జేబుల్లో, రవికల్లో, బ్యాంగుల్లో, నానా చోట్ల నగలు దాచుకుని చెక్కేస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే దోపిడీ లాంటిది ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు. బందిపోటు దొంగలు ఖరీదైన రేంజ్ రోవర్ కారులో ఏకంగా షాపు అద్దం బద్దలు కొట్టుకుని చొరబడి దోచుకెళ్ళారు. 

లండన్ లోని షెపర్డ్ బుష్ షాపులో గత ఏడాది నవంబర్‌లో ఈ సంఘటన జరిగింది. రేంజ్ రోవర్ కారులో దూసుకొచ్చిన ముగ్గురు దొంగలు షాపులోని డిస్‌ప్లే అరల అద్దాలను పగలగొట్టి అందిన కాడికి దోచుకున్నారు. తర్వాత అక్కడి నుంచి తప్పించుకోడానికి యత్నించగా షాపు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో దొంగలు మరో అద్దం పగలగొట్టుకుని బయటపడ్డారు. అయితే అప్పటికే జనం పోగై వారిలో ఒకడి పని పట్టారు. మిగతా ఇద్దరు దొంగలు తుర్రుమన్నారు. ఈ దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగల ముఠా ఇటీవలే రేంజ్ రోవర్‌ను చోరీ చేసిందని పోలీసులు చెప్పారు. పట్టుబడిన దొంగను 34 ఏళ్ల బెన్ వెగెనర్ గా గుర్తించారు.