కారుపై 50 రౌండ్ల కాల్పులు.. అక్కడికక్కడే మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

కారుపై 50 రౌండ్ల కాల్పులు.. అక్కడికక్కడే మృతి 

February 20, 2020

Gang war shooting in delhi

ఓ కారుపై దుండగులు ఏకంగా 50 రౌండ్ల కాల్పులు జరిపారు. అందులోని వ్యక్తి శరీరం జల్లెడలా మారిపోయి అక్కడిక్కడే చనిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ దారుణం జరిగింది. 

హత్యయత్నం కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఆంచల్ అలియాస్ పవన్ స్కార్పియో కారులో వెళ్తుండగా ప్రత్యర్థులు చుట్టుముట్టారు. పవన్‌పై కాల్పులు జరిపారు. పవన్ కూడా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దీపక్ టీటర్ గ్యాంగ్ మనుషులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.