అట్టహాసంగా మొదలైన గంగావిలాస్ క్రూయిజ్ ప్రయాణంలో మూడోరోజే హంసపాదు పడింది. క్రూయిన్ నౌక నదిలో తగినన్ని నీళ్లు అర్ధంతరంగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను ఒడ్డకు చేర్చారు. 3,200 మీటర్ల ప్రయాణంలో భాగంగా గంగావిలాస్ బిహార్‌లోని చింరద్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. నది తీరంలో తగినన్ని నీళ్లులేకపోవడంతో మధ్యలోనే డోరిగంజ్ వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను చిన్నపడవల్లో ఒడ్డుకు చేర్చారు. నీళ్లు బాగా తక్కువగా ఉన్నాయని, నౌకను తీరానికి తీసుకురావడం కష్టమని నిర్వాహకులు చెప్పారు. గంగావిలాస్ నౌకను ప్రధాని నరేంద్ర మోదీ గతవారం ప్రారంభించారు. ఇది 51 రోజుల్లో 27 నదీ మార్గాల్లో 51 రోజులు ప్రయాణం చేస్తుంది. భారత్, బంగ్లాదేశ్‌లలోని పర్యాటక ప్రాంతాలను, పుణ్యక్షేత్రాలను చుడుతూ వెళ్లుంది. టికెట్ ధర రూ. 20 లక్షల నుంచి 50 లక్షలు. 2024 మార్చి వరకు బుకింగ్స్ పూర్తయ్యాయి. దాదాపు అందరూ విదేశీయులే టికెట్లు కొనేశారు.