Gangadhar Reddy, a witness in the murder case of YS Vivekananda Reddy, died on suspicion
mictv telugu

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి అనుమానాస్పద మృతి

June 9, 2022

Gangadhar Reddy, a witness in the murder case of YS Vivekananda Reddy, died on suspicion

ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. వివేక హత్య కేసులో.. ప్రధాన సాక్షిగా ఉన్న గంగాధర్‌ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వివేకా హత్యకేసులో గంగాధర్‌రెడ్డిని సీబీఐ ఇప్పటికే విచారించింది. మూడుసార్లు కడపకు పిలిపించుకుని సీబీఐ అతన్ని ప్రశ్నించింది. నిందితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి అనుచరుడు. ప్రేమ వివాహం చేసుకుని అనంతపురం జిల్లా యాడికిలో గంగాధర్‌రెడ్డి ఉండేవాడు.
స్వగ్రామం పులివెందుల నుంచి యాడికి వచ్చిన గంగాధర్‌రెడ్డి… ప్రాణముప్పు ఉందని రెండుసార్లు ఎస్పీని కలిశారు. రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీని ఇప్పటికే గంగాధర్ రెడ్డి కలిశారు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ ఎస్పీకి గతంలో ఫిర్యాదు చేశారు. గంగాధర్‌రెడ్డి రాత్రి నిద్రలోనే మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అనుమానాస్పద మృతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గంగాధర్‌రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్నారు.