ఇంట్లోంచి పోనన్న గంగవ్వ.. బిగ్‌బాస్ హ్యాప్పీ - MicTv.in - Telugu News
mictv telugu

ఇంట్లోంచి పోనన్న గంగవ్వ.. బిగ్‌బాస్ హ్యాప్పీ

September 20, 2020

nvnvnh

‘నేను ఈ ఇంట్ల ఉండ. నాకు ఈ ఇంట్ల పడ్తలేదయ్యా. నేను పోతా.. నన్ను పంపియ్యు’ అని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుని ధీనంగా వేడుకున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం క్షీణించడంతో గంగవ్వ చాలా నీరసంగా తయారైంది. బిగ్‌బాస్ ఆమెను కంన్ఫెషన్ గదిలోకి పిలిచి సముదాయించే ప్రయత్నం చేశారు. ‘మీ ఆరోగ్యం గురించి మీరేం వర్రీ అవకండి. మిమ్మల్ని బాగా చూసుకోవడానికి డాక్టర్లు ఉన్నారు’ అని చెప్పారు. అన్నట్టుగానే డాక్టర్లు చికిత్స చేయడంతో గంగవ్వ మునుపటిలా చలాకీగా తయారైంది. శనివారం ఎపిసోడ్‌లో గంగవ్వను నాగార్జున ఇంటికి పోతావా గంగవ్వా? అని ప్రశ్నించారు. ‘ఏ పోను అన్నయ్యా.. నా పానం ఉషారులేక పోత అన్న. ఉంట ఈడనే’ అని గంగవ్వ చెప్పేసరికి నాగార్జున చాలా సంతోషించారు. 

ఇంటి సభ్యులు కూడా గంగవ్వ ఇంట్లో ఉంటాననే సరికి ఆనందించారు. గంగవ్వ ఏదైనా చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుందని.. ఇంటికి పెద్దదిక్కుగా అందరి బాగోగులు చూసుకుంటోందని ఇంటి సభ్యలు అందరూ భావిస్తున్నారు. అలాగే గంగవ్వ కాళ్లు ఒత్తుతున్న దివి గురించి నాగార్జున ప్రత్యేకంగా మాట్లాడారు. ‘దివి నువ్వు గంగవ్వకు మంచి సేవలు చేస్తున్నావమ్మా’ అని మెచ్చుకున్నారు. ‘నాకు అమ్మమ్మలాంటిది గంగవ్వ’ అని దివి సమాధానం చెప్పింది. ఈవారం కూడా ఎలిమినేషన్ లిస్టులో ఉన్న గంగవ్వ సేవ్ అయింది. కరాటే కళ్యాణి ఇంటినుంచి బయటకు వచ్చింది. గతవారం దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ అవగా ఈవారం కరాటే కళ్యాణి అయ్యారు. ఈవారం రెండు ఎలిమినేషన్లు ఉంటాయి అని నాగార్జున అన్నారు. మరి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాల్సిందే. ప్రస్తుతం ఎలిమినేషన్ లిస్టులో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. కాగా, బిగ్‌బాస్ ఇంట్లో గంగవ్వ ఉంటాను అనేసరికి బిగ్‌బాస్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.