రెచ్చిపోయిన గంగవ్వ.. మోనాల్ చెంప ఛెళ్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

రెచ్చిపోయిన గంగవ్వ.. మోనాల్ చెంప ఛెళ్లు..

September 24, 2020

Gangavva slapping monal in biggboss

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 రోజురోజుకి రసవత్తరంగా సాగుతోంది. ఇన్ని రోజులు ఒకరినొకరు దూషించుకున్న కంటెస్టెంట్లు ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. హౌజ్‌లోని సీనియర్ కంటెస్టెంట్ గంగవ్వ కూడా తనదైన శైలిలో యువ కంటెస్టెంట్లపై దాడి చేస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో గంగవ్వ.. మోనాల్ చెంప చెళ్లుమనిపించింది. గత రెండు రోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉక్కు హృదయం టాస్క్ నడుస్తోన్న సంగతి తెల్సిందే. 

మనుషులు-రోబో అని రెండు టీంలుగా విడిపోయి పాయింట్ల కోసం కొట్టుకుంటున్నారు. సొహైల్, మొహబూబ్‌లు కొట్లాటకు దిగారు. నువ్ మాగాడివేనా? అంటూ ఆడ, మగ తేడా చూడకుండా ప్రవర్తించారు. గురువారం నాటి ఎపిసోడ్‌లో మొనాల్.. అరియానాలు గొడవపడుతున్నారు. వీరు గొడవ పడుతుంటే రోబో టీంలో ఉన్న గంగవ్వ ఎంటరై మొనాల్ చెంప చెళ్లుమనిపించింది. టాస్క్‌లో భాగంగా మెయిన్ ఆఫ్ చేయడానికి వెళ్తున్న మొనాల్‌పై గంగవ్వ చేయిచేసుకుంది. ఈ సందర్భంగా గంగవ్వ నాలుక మడతపెట్టి దగ్గర్లో ఉన్న కుర్చీని ఎత్తిపడేసి మొనాల్‌పైకి దూసుకువచ్చింది. ఏంటే.. మీద మీదకి ఉరుకుతున్నావ్ అంటూ మొనాల్‌‌‌పైకి దూసుకొచ్చింది. దీంతో మొనాల్ ఒక్కసారిగా షాక్ అయింది. మరోవైపు లాస్య-దివిలు కూడా కొట్టుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.