ముంబై మాఫియా నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు కొత్తేం కాదు. చంపేస్తా..కాల్చేస్తాం…కిడ్నాప్ చేస్తామంటూ గ్యాంగ్ స్టర్ల నుంచి చాలాసార్లు బెదిరింపులు వచ్చాయి.అలావచ్చిన ప్రతీసారీ ప్రభుత్వం సల్మాన్ కి వ్యక్తిగత భద్రత కల్పించడమే కాదు రక్షణ కోసం వ్యక్తిగత లైసైన్స్ డ్ గన్స్ కూడా ఇచ్చింది. అయితే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ కి వచ్చిన బెదిరింపు మాత్రం సాధారణమైంది కాదనిపిస్తోంది. సల్మాన్ కి హెచ్చరికలు జారీ చేయడం…ప్లాన్ ప్రకారం రెక్కీ చేయడం లాంటివి ఇప్పటికే సంచలనంగా మారాయి. వాటి నుంచి సల్మాన్ కూడా తృటిలోనే తప్పించుకున్నాడు. ప్రస్తుతం బిష్ణోయ్ పంజాబ్ లోనపి భటిండా సెంట్రల్ జైల్ లో ఉన్నాడు. తాజాగా జైలు నుంచి కూడా సల్మాన్ కి మరోసారి భిష్ణోయ్ వార్నింగ్ ఇచ్చాడు.
సల్మాన్ ఖాన్ ని చంపడం తన జీవిత లక్ష్యమని..భాయ్ భద్రత తొలగిస్తే చంపేస్తానంటూ మరోసారి హెచ్చరించాడు భిష్ణోయ్. సల్మాన్ కి రావణుడి కంటే ఎక్కువ అహం ఉందని, కృష్ణ జింకను చంపినందుకు బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాలని.. బికనీర్ లోని గుడికి వెళ్ళి క్షమాపణలు కోరాలని డిమాండ్ చేసాడు. అలా చేస్తేనే సల్మాన్ ప్రాణాలతో బతికి ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు.
సల్మాన్ ను తాను నాలుగైదేళ్లగా చంపాలని ప్రయత్నిస్తున్నట్లు ఓ మీడియా ఇంటర్వ్యూలో భిష్ణోయ్ చెబుతున్నాడు. దీనిబట్టి బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నాడు అన్నది అర్ధమవుతుంది. కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే బిష్ణోయ్ పై ఇప్పటికే చాలా కేసులున్నాయి. దీంతో సల్మాన్ ఖాన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు పోలీలులు భావిస్తున్నారు. బిష్ణోయ్ వెనుక కీలక వ్యక్తులెవరు? అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో భాయ్ కి పటిష్ట భద్రత ఏ ర్పాటు చేసారు. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వెటాడిన కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.