పాక్ ఉగ్రవాదుల దోస్త్ బిల్లా అరెస్ట్.. వేలకోట్ల వ్యాపారం..  - Telugu News - Mic tv
mictv telugu

పాక్ ఉగ్రవాదుల దోస్త్ బిల్లా అరెస్ట్.. వేలకోట్ల వ్యాపారం.. 

May 9, 2020

Gangster Billa Mandiala Arrest

పాకిస్తాన్ ఉగ్రవాదుల సన్నిహితుడు భారత్‌లోకి ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి ఆటకట్టించారు చండీగఢ్ పోలీసులు. మోస్ట్‌వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న బల్జీందర్ సింగ్‌ అలియాస్ బిల్లా మండియాలాను అరెస్ట్ చేశారు. కపుర్తలా జిల్లాలోని సుల్తాన్‌పూర్ లోడి ప్రాంతంలో బిల్లా సహా అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రీ, మాధక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అతని వెనక ఉన్నవారి కూపీ లాగేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. 

పాకిస్థాన్ నుంచి అత్యాధునిక విదేశీ మారణాయుధాలను దేశంలోకి తెచ్చి విక్రయిస్తున్నట్టుగా తేల్చారు. సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు ఉపయోగించే జర్మన్ మేడ్ ఎస్ఐజీ సౌవెర్ పిస్టళ్లు కూడా బిల్లా వద్ద గుర్తించారు. దీంతో పాటు అతనికి ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, ఖలిస్థాన్ జిందాబాద్ ఫ్రంట్ అధినేతలతోనూ సంబంధాలు ఉన్నాయన్నారు. గతంలో బిల్లాపై అనేక హత్యలు, కిడ్నాపులు, డ్రగ్స్ సరఫరా కేసులు కూడా నమోదు అయ్యాయి. వేల కోట్ల రూపాయాలతో ఈ అక్రమ దందా సాగిస్తున్నాడు. పెద్ద ఎత్తున నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత కాలం పోలీసులకు చిక్కకుండా వ్యాపారం సాగిస్తున్న బిల్లా అరెస్టుతో కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.