Gangster Lawrence Bishnoi challenges hero Salman Khan
mictv telugu

సల్మాన్ ఖాన్‌ను రాజస్థాన్‌లో చంపుతా

May 31, 2022

బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్‌ను రాజస్థాన్‌లో చంపుతానంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ 2018లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రెండ్రోజుల కింద పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలాను తాను చంపానని బిష్ణోయ్ ప్రకటించడంతో గత వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 2018లో పోలీసులు బిష్ణోయ్‌తో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

కోర్టు రిమాండ్ విధించగా, బయటికి వచ్చిన బిష్ణోయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సల్మాన్ ఖాన్‌ను చంపితే నేనేంటో మీకు తెలుస్తుంది. మీరేం చేస్తారో చూస్తా’ అని బహిరంగంగా సవాలు చేశాడు. ఆ వీడియోలో బిష్ణోయ్‌తో పాటు ఆయన సహాయకుడు నెహ్రా కూడా ఉన్నాడు. అంతకు ముందు నెహ్రా సల్మాన్ ఇంటిపై రెక్కీ కూడా నిర్వహించాడు. దీంతో పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేశారు. కాగా, 700 మంది షూటర్లతో 5 రాష్ట్రాల్లో ఈ ముఠా విస్తరించింది. పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులకు తలనొప్పిగా మారింది. పంజాబీ ఆర్టిస్టులు, సింగర్లపై దాడులు చేయడం ఈ గ్యాంగ్ ప్రత్యేకత.