నా కొడుకును ఎన్‌కౌంటర్ చేయండి.. గ్యాంగ్‌స్టర్ తల్లి - MicTv.in - Telugu News
mictv telugu

నా కొడుకును ఎన్‌కౌంటర్ చేయండి.. గ్యాంగ్‌స్టర్ తల్లి

July 4, 2020

gjgj

యూపీలో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాశ్ దుబేపై సర్వత్రా విమర్శలు వస్తూనే ఉన్నాయి. కరుడు గట్టిన నేరగాడిగా మారి మానవాళికి ముప్పుగా మారిన అతన్ని చంపేయాలని ఏకంగా కన్న తల్లి సరళా దేవి కూడా డిమాండ్ చేస్తోంది. ఒకవేళ తన కొడుకు పట్టుబడే అవకాశం ఉన్నా అదుపులోకి తీసుకోకుండా కాల్చి చంపేయాలని సూచించారు. ఈ చర్యతో తమ కుటుంబం అపఖ్యాతి పాలైందని ఆమె భావోద్వేగం చెందారు. 

అరెస్టు చేసేందుకు వచ్చిన అమాయక పోలీసులను చంపిన విషయం తెలిసి తాను చాలా బాధపడ్డానని చెప్పారు. ఈ పని చేసినందుకు వెంటనే లొంగిపోవాలని సూచించారు. ఒకవేళ లొంగిపోకున్నా కూడా పోలీసులు పట్టుకుంటారనీ, కానీ అలాంటి వాడిని చంపేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తర్వాతే వికాశ్ నేరస్తుడిగా మారాడని చెప్పారు. ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యేను గెలిపించడానికి  మంత్రి సంతోశ్ శుక్లాను కూడా చంపేశాడని తెలిపారు. కాగా వికాశ్ గ్యాంగ్ స్టర్‌గా మారడని తెలిసినప్పటి నుంచి సరళాదేవి తన చిన్న కొడుకుతో కలిసి లక్నోలో నివాసం ఉంటున్నారు. కాగా ఇటీవలో ఓ కేసులో అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై వికాశ్ సహా అతని అనుచరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో డీఎస్సీ, ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు మరణించారు. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో వికాశ్ అనుచరులు ముగ్గురిని పోలీసులు మట్టుబెట్టారు.