ముంబై మాఫియా డాన్ పాత్రలో 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ - MicTv.in - Telugu News
mictv telugu

ముంబై మాఫియా డాన్ పాత్రలో ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ

January 16, 2020

mn bgv

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్‌ తొలిసారి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమాకు సంబందించిన ఆలియా భట్ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లలో పవర్‌ఫుల్‌ లుక్‌తో ఆలియా అదరగొట్టేసింది. 

ఈ పోస్టర్‌లలో ఆలియా నుదుటను పెద్ద తిలకం ధరించి.. ముక్కుపుడకతో గంభీరంగా కనిపిస్తున్నది. సల్మాన్‌ ఖాన్‌తో అనుకున్న ‘ఇన్‌షా అల్లా’ సినిమా కొన్ని విభేదాల కారణంగా ఆగిపోయిన తరువాత… భన్సాలీ ఆలియాతో ‘గంగూబాయి కతియావాడి’ సినిమాను ప్రారంభించారు. ముంబై మాఫియా డాన్ గంగూబాయి కతియావాడి బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హుస్సైన్‌ జెదీ రచించిన మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఆలియా భట్.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా ఈ ఏడాది జులై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.