క్రికెట్ అభిమానులకు రోహిత్, కోహ్లిల రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లు ఇద్దరు గ్రీసులో ఉన్నారంటే అభిమానులకు పండగే. అటువంటి కోహ్లి, రోహిత్‌లు ఐపీఎల్ 15వ సీజన్లో సరిగ్గా ఆడలేకపోతున్నారు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కొంతమంది అభిమానులు క్లోహిని కొన్ని పక్కన పెట్టాలని యాజమాన్యాన్ని వేడుకున్నారు.
కోహ్లి, రోహిత్‌లు ఎందుకు సరిగ్గా ఆడటం లేరో, అందుకు సంబంధించిన కారణాలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు.’ ‘ప్రస్తుతం కోహ్లి, రోహిత్‌లు ఫామ్‌లో లేరు. అందుకే సరైన ప్రదర్శన చేయలేకపోతున్నారు. కోహ్లీ, రోహిత్‌లు గొప్ప ఆటగాళ్లు. అందులో ఎటువంటి సందేహం లేదు. వారిద్దరూ అతిత్వరలోనే తప్పకుండా మళ్లీ ఫామ్‌లోకి వస్తారు. పరుగులు సాధించడం షురూ చేస్తారు” అని అన్నారు.
మరోపక్క కోహ్లీ 9 మ్యాచ్‌ల్లో 128 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 8 మ్యాచ్‌ల్లో 153 పరుగులు చేశారు. దీంతో ఐపీఎల్ అభిమానులు క్లోహి, రోహిత్‌లపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో గంగూలీ స్పందిస్తూ..క్లోహి, రోహిత్‌ల రికార్డుల గురించి ప్రస్తావించారు. అనంతరం గుజరాత్, లక్నో కొత్త జట్లను గంగూలీ మెచ్చుకున్నారు.