హైదరాబాద్‌లో గంజాయి ముఠా.. రూ.2.62 కోట్ల సరుకు సీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో గంజాయి ముఠా.. రూ.2.62 కోట్ల సరుకు సీజ్

August 15, 2020

Ganja Container Seized in Hyderabad

హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి ముఠాను డీఆర్ఐ అధికారులు గుర్తించారు.నగర శివార్లలో చేపట్టిన తనిఖీల్లో డంప్ బయటపడటంతో సీజ్ చేశారు.  ఓ కంటైనర్‌లో ఇతర వస్తువులతో పాటు గంజాయిని కూడా దాచి తరలిస్తున్నారు. పక్కా సమాచారం ఉండటంతో 1,050 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు దీన్ని తరలిస్తుండగా హైదరాబాద్‌ నగర శివార్లలో అధికారులకు చిక్కారు. ప్లాస్టిక్‌ సంచుల్లో దాచి ఏ మాత్రం అనుమానం రాకుండా తరలిస్తున్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కంటైనర్ సీజ్ చేశారు. ఈ ముఠా సభ్యుల వివరాలను ఆరా తీస్తున్నారు. దీని విలువ రూ. 2.62 కోట్లు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీగా ఇలా సరుకు రావాణా జరగడంతో నిఘా మరింత పటిష్టం చేశారు.