వనం… మనం.. అనే కార్యక్రమాన్ని కాస్త మార్చి వనం, మనం. ఇంట్లో గంజాయి వనం గా మార్చుకున్నాడో యువకుడు. విజయవాడుకు చెందిన దినేష్ కు గంజాయి తాగడం అలవాటు ఉంది. విజయవాడ నున్న ప్రాంతానికి చెందిన ఇతను ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బయట గంజాయి కొనుక్కు తింటే డబ్బులు దండగ… పైగా పట్టుకుంటారనే భయం ఉంటుంది. అందుకే ఇంట్లోనే ఓ మొక్కను పెంచుకుంటే పోలా అనుకున్నట్లుంది. అందుకే వనం, మనం కార్యక్రమం కింద తెచ్చానని చెప్పి ఇంట్లోనే గంజాయి మొక్కనుపెంచుతున్నాడు.
తల్లిదండ్రులకూ దీనిపై అనుమానం రాకుండా వనం, మనం కార్యక్రమం కింద మొక్క తెచ్చి నాటుతున్నానని చెప్పాడు. వాళ్లకూ అనుమానం రాలేదు. ఈయన స్నేహితులు కొందరు విజయవాడలోని ఓ మహిళ వద్ద గంజాయి కొనుకుని తాగేవారట. ఏదో విషయంలో గొడవ పడిన స్నేహితులు పోలీసు స్టేషన్ కు వెళ్లారు. అక్కడ విషయం బయటకు వచ్చింది. ఇంట్లో పెరుగుతున్న గంజాయి మొక్క విషయమూ బయటకు పొక్కింది. వనం,మనం కార్యక్రమం గుట్టు రట్టై దినేష్ స్టోరీ బయటకు వచ్చింది.