ganji Chiranjeevi resigned from TDP
mictv telugu

పార్టీలో నన్ను మానసికంగా చంపేశారు : చిరంజీవి

August 10, 2022

గత ఎన్నికల్లో టీడీపీ యువనేత లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత గంజి చిరంజీవి బుధవారం రాజీనామా చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘బీసీల పార్టీ అని టీడీపీలో చేరాను. కానీ, అక్కడ బీసీలకు చోటు ఉండదు. కష్టపడి పని చేసినా నన్ను మానసికంగా హత్య చేశారు. మంగళగిరి నియోజకవర్గం చేనేతలకు సంబంధించినది. ఆ ఒక్క సీటు లాక్కుని లోకేష్ మాకు ద్రోహం చేశారు. పార్టీని నేను మోసం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు. పార్టీయే నన్ను మోసం చేస్తే అదే దేవుడు టీడీపీ సంగతి చూసుకుంటాడు. 2019 ఎన్నికల్లో చివరి వరకు సీటు నీకే అని నమ్మించి టికెట్ ఇవ్వకుండా అవమానించారు’ అని ఆరోపించారు.