ఏపీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ! - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ!

November 26, 2019

టీడీపీ మాజీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారని సమాచారం. వైసీపీలో చేరడం, అలాగే తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించడానికి ఆయన్ను కలిశారట. ఈ భేటీలో వంశీ స్నేహితుడు మంత్రి కొడాలి నాని కూడా పాల్గొన్నారట. డిసెంబర్ 9 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వంశీ సీఎం జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

valabhannei vamshi.

ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిబంధన ఉన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా వద్దా? ఒకవేళ రాజీనామా చేస్తే వైసీపీలో తనకు ఇచ్చే గౌరవం ఏంటి? అనే అంశాలపై సీఎం జగన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై వల్లభనేని వంశీ మోహన్ వెనక్కి తగ్గినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడాన్ని అంగీకరించడం లేదని చెప్పుకొస్తున్నారు.