అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ సీటు ఎక్కడ? - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ సీటు ఎక్కడ?

November 17, 2019

vamsi .

విజయవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం టీవీ డిబేట్లల్లో టీడీపీ నేతలను తీవ్రంగా దూషించారు. ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన వైసీపీలో చేరలేదు. అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయలేదు. డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ సీటు ఎక్కడంటూ చర్చ జరుగుతోంది.

ఒకవేళ వంశీ సమావేశాల్లో పాల్గొంటే… ఎక్కడ కూర్చుంటారు అన్నది తెలియాల్సి ఉన్నది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి అక్కడ వాళ్లతో కలిసి కూర్చోలేరు. వైసీపీలో ఇంకా చేరలేదు కాబట్టి అక్కడ కూర్చోలేడు. ఇప్పుడు ఆయన సీటు ఎక్కడ అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు వంశీ ఏ పార్టీలో లేడు కాబట్టి స్వతంత్రుడిగా ఒంటరిగా కూర్చునే అవకాశం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వంశీని తటస్థ అభ్యర్థిగా పరిగణిస్తామని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీంతో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు విభాగాలకు బదులు నాలుగు విభాగాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే మాదిరిగా స్వతంత్ర ఎమ్మెల్యేగా ఆయన పక్కన వంశీకి సీటు కేటాయించే అవకాశం ఉంది.