Garbage has piled up on a Mumbai beach
mictv telugu

వీడియో : ముంబయికి రిటర్న్ గిఫ్ట్.. ఇచ్చేసిన అరేబియా సముద్రం

July 21, 2022

మనం ఏది ఇస్తే అదే మనకు చేరుతుందంటారు. అది నిజమే కాబోలు. ఈ నియమం మనుషులకే కాదు ప్రకృతికి కూడా వర్తిస్తుందనుకుంటా. పై వ్యాక్యానికి ఉదాహరణగా నిలుస్తోంది ముంబైలోని బీచ్. సముద్రంలో వ్యర్ధాలను వేస్తే కలిగే దుష్పభావాల గురించి ప్రకృతి ప్రేమికులు ఎంతగా మొత్తుకుంటూ చెప్పినా, ప్రజలు చెవికెక్కించుకోవడం లేదు. కింద ఉన్న వీడియోలో తన ఒడిలో దాచుకున్న చెత్తను అరేబియా సముద్రం తిరిగి ఇచ్చేసిన వైనం చూస్తే ఇది తగిన గుణపాఠం అని అనిపిస్తోంది. ముంబైలోని మహిమ బీచ్‌లో చెత్తా చెదారంతో నిండిన ప్రదేశం ఇది. సముద్రంలోని చెత్త అంతా ఒడ్డుకు కొట్టుకురావడంతో వీడియో తీసి ముంబై మ్యాటర్స్ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ‘ముంబైలోని బీచ్‌లను పర్యాటకుల కోసం తెరచి ఉంచారు. పర్యాటకులు అక్కడికి ఉల్లాసం కోసం కాకుండా ఈ చెత్తను చూడడానికి వస్తారనుకుంటా’నని క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన బీఎంసీ (బృహత్ ముంబై కార్పొరేషన్) స్పందిస్తూ.. ‘సముద్రంలో విసిరే చెత్త తిరిగి బీచ్‌కే చేరుతుంది. దీనివల్ల మనకే కాకుండా సముద్ర జీవులకు కూడా హానికరం. దయచేసి సముద్రంలో చెత్త వేయకండి’ అని ప్రజలను కోరింది. వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.