Gardener grows ‘world’s most venomous plant’ gympie-gympie in a locked cage at home
mictv telugu

ఈ మొక్కను పెంచితే మీరు ఆత్మహత్య చేసుకుంటారు

November 3, 2022

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్కను తన ఇంట్లో పెంచుతున్నాడో వ్యక్తి. అది కూడా కేవలం సరదా కోసం. ఖాళీ సమయంలో తనకు బోర్ కొడుతుందని ..ఆ బోర్‌డమ్‌ని పోగొట్టుకోవడానికి పనిగట్టుకుని ఈ పని చేస్తున్నాడు. ప్రాణాలు పోతాయని తెలిసినా.. మరేం పర్లేదని ఆస్ట్రేలియా నుంచి 60 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చుపెట్టి, విత్తనాలు తెప్పించుకుని మరీ ఈ మొక్కను పెంచుతున్నాడు.

బ్రిటన్ కు చెందిన ఆన్ లైన్ ట్యూటర్ డేనియల్ ఎమ్లిన్ జోన్స్(49) అనే వ్యక్తి.. త‌న గార్డెన్‌లో జెరానియం అనే పూల‌మొక్క‌ల్ని పెంచి బోర్ కొట్టింద‌ని అందుకనే ఈ మొక్కను పెంచుతున్నానని చెబుతున్నాడు. జింపీ జీంపీ గా పిలిచే ఈ మొక్క ఎంత ప్రమాదకరమైందంటే… పొరపాటున దాని మళ్లు గుచ్చుకుంటే యాసిడ్ ఒంటి మీద పడినపుడు, కరెంట్ షాక్ కూడా తగిలితే ఎంత నొప్పి పుడుతుందో అంతే నొప్పి కలుగుతుందట. ఆకులు, కొమ్మ‌లు త‌గిలినా కూడా కొన్ని వారాల నుంచి నెల‌ల పాటు నొప్పి ఉంటుందట.

ఈ మొక్క ఉన్నచోట తరచుగా గడిపితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయని కొన్ని పరిశోధనలలో వెల్లడైంది. తన ఇంట్లో ప్రత్యేక ఏర్పాట్లతో ఈ మొక్కను పెంచుతున్నాడు జోన్స్. దాని చుట్టూ ఓ కంచెను తయారు చేసి, దానికి డేంజర్ బోర్డు తగిలించి జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపాడు.