విమానంలో కరోనా పేషంట్ మృతి..  - MicTv.in - Telugu News
mictv telugu

విమానంలో కరోనా పేషంట్ మృతి.. 

October 21, 2020

Garland woman in her 30s no more of coronavirus during July flight in Arizona, Dallas County Officials say

కరోనా వచ్చిన తొలినాళ్లలో కొందరు తమకు కరోనా సోకిన విషయాన్ని కూడా తెలుసుకోలేక చనిపోయిన ఘటనలు ఉన్నాయి. దీంతో కరోనా వారినుంచి మరికొంతమందికి విస్తరించింది. ఈ నేపథ్యంలో ఓ కరోనా పేషెంట్ విమానంలోనే చనిపోయిందని అమెరికా అధికారులు వెల్లడించారు. జులైలో జరిగిన ఈ ఘటన గురించి వారు తాజాగా ఆదివారం తెలిపారు. అరిజోనా నుంచి టెక్సాస్‌కు బయలుదేరబోయే విమానంలో ఆమె మరణించిందని పేర్కొన్నారు. మృతిచెందిన మహిళ(30)ది టెక్సాస్‌లోని గార్లాండ్ ప్రాంతమని తేల్చారు. అరిజోనాలో విమానాశ్రయంలోనే ఆమె కన్నుమూసిందని చెప్పారు. విమానం రన్‌వే పైకి వెళ్లకముందే ఆమె చనిపోయిందని డల్లాస్ కౌంటీ అధికారి లారెన్ ట్రింబుల్ పేర్కొన్నారు. ఆమె చనిపోయేనాటికి తనకు కరోనా ఉందనే విషయం సదరు మహిళకు తెలుసో లేదో? అనే వివరాలపై స్పష్టమైన సమాచారం లేదని ఆయన అన్నారు. 

సీడీసీ నియమ నిబంధనల ప్రకారం ఇది కరోనా మరణమే అని ట్రింబుల్ స్పష్టంచేశారు. కరోనా హెచ్చరికల ప్రకారం తాము హై రిస్క్ జోన్‌లో లేమని చాలామంది అనుకుంటారని.. అలాంటివారికి ఇదొక కనువిప్పు కావాలి అని ట్రింబుల్ తెలిపారు. ఈ విషయమై  డల్లాస్ కౌంటీ జడ్జి క్లే జెంకిన్స్ మాట్లాడుతూ.. ‘చనిపోయే ముందు ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో ఆమెకు ఆక్సిజన్ అందించారు. ఆమెకు హై రిస్క్ హెల్త్ కండీషన్స్ కూడా ఉన్నాయి’ అని తెలిపారు. జూలై 25న ఆ మహిళ చనిపోయినప్పటికీ, కొద్ది రోజుల క్రితం వరకు ఇది కరోనా సంబంధిత మరణం అని అధికారులు గుర్తించలేదని జెంకిన్స్ వెల్లడించారు.  ముప్పైలలో ఉన్న ఆ మహిళ కరోనా కారణంగా మరణించింది. దీంతో కోవిడ్19కు వయసుతో సంబంధం లేదని తెలుస్తోందని జెంక్సిన్ అభిప్రాయపడ్డారు. . కాగా, ఈ కేసు గురించి కౌంటీ అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించలేదు.