Gauri Khan participated in Koffee with Karan show
mictv telugu

ఒకేసారి ఇద్దరబ్బాయిలతో వద్దు.. కూతురికి గౌరీఖాన్ సలహా

September 19, 2022

బాలీవుడ్‌లో విజయవంతమైన పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ గురించి పాఠకులకు తెలిసిందే. దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా ఉన్న ఈ షోలో వ్యక్తిగత, శృంగార, అసభ్య ప్రశ్నలు వేస్తారనే నింద కూడా ఉంది. ఈ క్రమంలో కొన్ని అంశాలు సంచలనమవుతుంటాయి. ఒక సెక్షన్ ఆఫ్ ప్రేక్షకులు ఈ షో అప్డేట్ గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ సీజన్‌లో 12వ ఎపిసోడ్ ట్రైలర్‌ను కరణ్ జోహార్ సోషల్ మీడియాలో తాజాగా విడుదల చేశారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్, భావన పాండే, మహీప్ కపూర్‌లు ఈ షోలో పాల్గొని తమ వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలు పంచుకున్నారు. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న షారూక్ కూతురు సుహానా ఖాన్ గురించి కరణ్ ప్రశ్నలు వేశారు. డేటింగ్ గురించి మీ అమ్మాయికి మీరిచ్చే సలహా ఏంటని అడుగగా, ఒకేసారి ఇద్దరబ్బాయిలతో డేటింగ్ చేయవద్దని చెప్తానని నవ్వుతూ సమాధానమిచ్చింది. షారూక్‌తో మీ ప్రేమకథకు ఏ టైటిల్ ఎంచుకుంటారని అడిగితే దిల్ వాలా దుల్హనియా లేజాయేంగే అని ఆన్సరిచ్చింది. అంతేకాక, షారూఖ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. గురువారం పూర్తి ఎపిసోడ్ రిలీజవుతుంది. కుదిరితే చూసేయండి.