నక్సల్స్ హస్తం కూడా ఉండొచ్చేమో.. - MicTv.in - Telugu News
mictv telugu

నక్సల్స్ హస్తం కూడా ఉండొచ్చేమో..

September 7, 2017

కర్ణాటకకు చెందిన మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై ఆమె సోదరుడు ఇంద్రజిత్ సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరి హత్య వెనుక హిందూ మతోన్మాద శక్తులతోపాటు నక్సలైట్ల హస్తం కూడా ఉండొచ్చని ఆరోపించారు. నక్సల్స్ నుంచి గౌరికి బెదిరింపు లేఖలు వచ్చాయని, అయితే ఆమె ఈ విషయాన్ని దాచారని వెల్లడించారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి తన సోదరి ప్రభుత్వంతో కలసి కృషి చేశారని, ఇది వారికి నచ్చలేదని ఇంద్రజిత్ అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమెను లేఖల్లో హెచ్చరించారన్నారు. అయితే గౌరి నక్సల్స్ కు సానుభూతిపరురాలు కావడం ఇంద్రజిత్ కు ఇష్టం లేదని, దీనిపై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం.