అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ సుడిగుండంలో చిక్కుకున్న అదానీ గ్రూప్ తన పెట్టుబడిదారులకు కంపెనీపై నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేస్తోంది. బుధవారం గ్రూప్ తన బ్యాలెన్స్ షీట్ నుంచి కంపెనీ మంచిస్థితిలో ఉందని పెట్టుబడిదారులకు వివరించింది. మార్కట్ క్యాప్ సగానికిపై తగ్గడంతో.. ఇన్వెస్టర్లతో సమావేశమైన అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేషిందర్ రాబీ సింగ్ ఈ ప్రకటన చేశారు.
బుధవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సందర్బంగా అదానీ గ్రూప్ కు చెందిన నాలుగు షేర్లు మళ్లీ లోయర్ సర్య్కూట్ ను తాగాయి. ఇతర కంపెనీల షేర్లు గ్రీన్ మార్క్ లో ట్రెండ్ అయ్యాయి. ఇంతలో కంపెనీ బ్యాలెన్సీ షీట్ పరిష్కారం గురించి కంపెనీ కీలక ప్రకటన చేసింది. కంపెనీపై హిండెన్ బర్గ్ ప్రభావం ఉన్నప్పటికీ…తమ దృష్టి అంతా కూడా వ్యాపార వేగాన్ని కొనసాగించడంపై ఉందని వెల్లడించింది.
త్రైమాసిక ఫలితాలు వెలువడిన తర్వాత ఇన్వెస్టర్లతో చర్చించారు అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ రాబీ సింగ్. మా వద్ద తగినంత డబ్బు ఉంది. రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం మాకు ఉంది. మమ్మల్ని నమ్మండి అంటూ హామీ ఇచ్చినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ప్రస్తుత మార్కెట స్థిరీకరించిన తర్వాత..మా క్యాపిటల్ మార్కెట్ వ్యూహాన్ని మరోసారి సమీక్షిస్తామని సింగ్ తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలన్న దానిపై తాము దృష్టి సారించినట్లు ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ 25ఏళ్ల అనుభవం ఉంది. క్రమశిక్షణతో మూలధనాన్ని పెట్టుబడి పెట్టింది. ఇన్నేళ్లూ అదానీ గ్రూపులు అగ్రగామిగా నిలిచాయి. హిండెన్ బర్గ్ ప్రభావంతో గౌతమ్ అదానీ ఇప్పుడు షార్ట్ సెల్లర్ ఫర్మ్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సింగ్ తమ ఇన్వెస్టర్లకు వివరించారు.