ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయని సామెత. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ ఆదానీ ఓడ క్రమంగా బండిగా మారుతోంది. కుబేరుల ర్యాంకుల్లో ఆయన స్థానం రోజురోజుకు దిగజారిపోతోంది. ఫోర్బ్స్, బ్లూంబర్గ్ వంటి అంతర్జాతీయ బిలియనీర్ల సూచీల్లో రోజూ దిగువకు పడిపోతున్నారు. బ్లూంబర్గ్ ఇండెక్స్ లోని టాప్ 20ను బయటికి వచ్చేసి 21వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఫోర్బ్స్ జాబితాలో మాత్రం 17వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్ కంపెనీలు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాయని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక ఇవ్వడంతో ఆదానీ సామ్రాజ్యం పేకమేడల కూలుతున్న సంగతి తెలిసిందే. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనర్ 2023 జాబితాలో 10వ స్థానంలో ఉండిన అదానీ మరింత కిందకు 17కు పడిపోయారు. ఆదానీ పతనంతో ముఖేశ్ అంబానీ దేశ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. బ్లూంబర్గ్ లెక్కల ప్రకారం.. ముఖేష్ అంబానీ మొత్తం నికర ఆస్తుల విలువ 82.2 బిలియన్ డాలర్లు (రూ. 6 లక్షల కోట్లు). గౌతమ్ అదానీ నికర విలువ $61.3 బిలియన్లు (రూ. 5 లక్షల కోట్లు). హిండెన్ బర్గ్ నివేదిక ప్రభావంతో ఆదానీ సంపద 124 బిలియన్ల నుంచి ఈ స్థాయికి పతనమైంది.
ఇది ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ జెయింట్ ఎల్ఎమ్‌వీహెచ్ బెర్నార్డ్ అర్నౌల్ట్ (191 బిలియన్ డాలర్లు) కొనసాగుతున్నారు. రెండో స్థానంలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, మూడో స్థానంలో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో, నాలుగో ర్యాంకులో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఉన్నారు. ముకేశ్ అంబానీ 13వ స్థానం దక్కించుకున్నారు.