Gautam Adani slips to third spot in billionaires ranking
mictv telugu

ఒక్క రోజే రూ.57 వేల కోట్ల లాస్.. మళ్లీ మూడో స్థానానికి అదానీ

September 28, 2022

ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని సంపాదించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. ఆయనకు 7 బిలియన్ డాలర్ల మేర అంటే భారతీయ కరెన్సీ లెక్కల్లో రూ.57 వేల కోట్ల సంపద హరించుకుపోవడంతో.. అదానీ రెండో స్థానాన్ని కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ జాబితాలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఒడుదుడుకులకు గురవుతున్నాయి. మార్కెట్లు రెండు రోజుల నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ కూడా నష్టాల్లో ట్రేడవుతూ రూ.57 వేల కోట్లకు పడిపోయాయి.

కాగా, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మళ్లీ తన రెండో స్థానాన్ని తాను సంపాదించుకున్నారు. ప్రస్తుతం జెఫ్ బెజోస్ నికర సంపద 138 బిలియన్ డాలర్లు కాగా, గౌతమ్ అదానీ సంపద 135 బిలియన్ డాలర్లు అని బ్లూంబెర్గ్ వెల్లడించింది. కాగా, ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 245 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 82.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో నిలిచారు.