Gautam Adani slips to third spot on Asia’s rich list
mictv telugu

ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి అదానీ

August 30, 2022

భారత కుబేరుడు గౌతమ్ అదానీ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. కాలేజీ డ్రాపౌట్ అయిన అదానీ.. డైమండ్ ట్రేడర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్‌లో టాప్-3లో అడుగుపెట్టిన తొలి ఆసియా వ్యక్తిగా గౌతమ్ అదానీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ముకేశ్ అంబానీ, జాక్ మా‌కు సైతం సాధ్యం కాని ఈ ఫీట్‌ను అదానీ సాధించడం విశేషం.

ఆదానీ ఇప్పుడు ప్ర‌ప‌gచంలో అత్యంత సంప‌న్నుల జాబితాలో మూడ‌వ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ డేటా వెల్ల‌డించింది. ఆయ‌న ఆస్తులు సుమారు 137 బిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌పంచంలో టాప్ ప్లేస్‌లో ఉన్న కుబేరుల్లో ఎల‌న్ మ‌స్క్‌, జెఫ్ బేజోస్ ఉన్నారు. ఆ త‌ర్వాత స్థానంలో 60 ఏళ్ల బిజినెస్ టైకూన్ గౌత‌మ్ అదానీ నిలిచారు.

బ్లూమ్‌బ‌ర్గ్ నివేదిక ప్ర‌కారం.. ఆసియాకు చెందిన సంప‌న్నుల్లో తొలిసారి ఆ జాబితాలో చేరారు. భార‌త టైకూన్ ముఖేశ్ అంబానీ, చైనాకు చెందిన అలీబాబా గ్రూపు జాక్ మా సంప‌న్నుల జాబితాలో ఉన్నా.. వాళ్లెప్పుడు కూడా టాప్ త్రీ ప్లేస్‌లోకి రాలేదు. 2022లోనే అదానీ సంపద 60.9 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఫిబ్రవరిలో ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి ఆసియా కుబేరుడిగా అదానీ నిలిచారు. ఏప్రిల్‌లో ఆయన సంపద 100 బిలియన్‌ డాలర్లు దాటింది. 2021, మార్చి 31 నాటికి అదానీ సంస్థ సుమారు 5.3 బిలియ‌న్ల డాల‌ర్ల రెవన్యూను ఆర్జించింది. ఎన్డీటీవీలో 29 శాతం వాటాను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు అదానీ సంస్థ గ‌త వారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది.