విదేశాలకు మకాం మారస్తున్న అదానీ.. స్కెచ్ మామూలుగా లేదు - MicTv.in - Telugu News
mictv telugu

విదేశాలకు మకాం మారస్తున్న అదానీ.. స్కెచ్ మామూలుగా లేదు

November 17, 2022

వ్యాపార రంగంలో గౌతమ్ అదానీ పేరు తెలియని వారుండరు. దేశంలో కాస్త చదువుకున్న వారికి కూడా పరిచయ్ అక్కర్లేని పేరు అది. ఆసియాలో అత్యంత ధనవంతుడిగా, ప్రపంచ కుబేరుల్లో టాప్ 3 లో ఉండే ఏషియన్‌గా ఉన్న ఆయనకు 120 బిలియన్ డాలర్ల సంపద ఉంది. దీన్ని ఇంకా పెంచే ఉద్దేశంతో వేలకోట్ల డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు.

ఈ క్రమంలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న అదానీ.. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్టు బ్లూమ్ బర్గ్ సంస్థ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు విదేశాల్లో కూడా తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారు. అందులో భాగంగా మన దేశం నుంచి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇటీవలే దుబాయ్, లండన్‌‌‌లలో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. సింగపూర్‌‌లో కూడా ఫ్యామిలీ ఆఫీస్ తెరిచినట్టు సమాచారం. ఇదే బాటలో ఇప్పుడు అదానీ సైతం పయనిస్తున్నారు. దుబాయ్ లేదా న్యూయార్క్‌లో ఫ్యామిలీ ఆఫీస్ తెరుస్తారని బ్లూమ్ బర్గ్ విశ్వసనీయంగా తెలిపింది. విదేశాల్లో వ్యక్తిగత పెట్టుబడులకు ఇది కేంద్రంగా ఉంటుందని, అందుకోసం మేనేజర్లను కూడా నియమించుకునే యోచన చేస్తున్నారని వివరించింది. ఇదే గనుక నిజమైతే అదానీ త్వరలోనే ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.