ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం ఈ నెల 12న అహ్మదాబాద్ లో నిరాడంబరంగా జరిగింది. అతికొద్ది మంది బంధు, మిత్రుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీత్ అదానీ,దివా జైమిన్ షా నిశ్చితార్థం రోజున సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షా యే అదాని కోడలు. జైమిన్ షా తన సి. దినేష్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ని ముంబై, సూరత్ నగరాల్లో నిర్వహిస్తున్నారు.
అదాని కుమారుడు జీత్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుంచి తన స్టడీ పూర్తి చేశారు. 2019 లో అదానీ గ్రూప్ లో చేరి.. గ్రూప్ ఫైనాన్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉన్నారు. జీత్ అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు కూడా చీఫ్ గా వహిస్తున్నారు.
తక్కువ కాలంలోనే మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందిన అదాని వ్యాపార సామ్రాజ్యాన్ని హిడెన్ బర్గ్ నివేదిక దెబ్బకొట్టింది. ఒక్కసారిగా అతడి షేర్లు కుప్పకూలిపోయాయి. భారతీయ బిలినీయర్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆయన ఒక్కసారిగా ఆ స్థానం నుంచి కనిపించకుండా పోయారు. అయితే అదాని మాత్రం తాను ఏ తప్పు చేయలేదంటూ హిడెన్ బర్గ్ నివేదికపై పోరాటం చేస్తున్నారు.