ధోనివల్లే సెంచరీ చేజారింది..గౌతమ్ గంభీర్ సంచలనం - MicTv.in - Telugu News
mictv telugu

ధోనివల్లే సెంచరీ చేజారింది..గౌతమ్ గంభీర్ సంచలనం

November 18, 2019

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ 2011లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించారు. ధోని వల్లే తాను సెంచరీ మిస్స్ అయ్యానని చెప్పారు. కీలక దశలో క్రీజులో ఉన్న తాను సెంచరీ చేరువయ్యానని ఇంకో మూడు పరుగులు చేయాలని ధోని చెప్పినట్టు తెలిపారు. ఆయన మాటలతో ఒత్తిడికి గురైన తాను ఔటవ్వాల్సి వచ్చిందన్నారు. జట్టు విజయం కోసం పనిచేశాని కానీ, వ్యక్తిగత స్కోరు కోసం ఏనాడూ ఆడలేదని చెప్పారు. వరల్డ్ కప్‌ ఫైనల్స్‌లో తనకు ఎదైన ఈ మూడు పరుగులు తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయన్నారు. 

కాగా 2011 శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేజార్చుకున్నారు. భారత్ ఆరంభంలోనే సచిన్, సెహ్వాగ్ వికెట్లను కోల్పోయింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన గంభీర్ అద్భుతంగా ఆడాడు. 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ చివరి నిమిషంలో సెంచరీ చేయకుండానే ఫెవిలియన్‌కు చేరుకున్నారు. సెంచరీ పూర్తి చేయబోయి భారీ షాట్‌కు ట్రై చేసి నిష్క్రమించారు.