గంభీర్‌, సునిల్‌ ఛెత్రీలకు పద్మశ్రీ.. - MicTv.in - Telugu News
mictv telugu

గంభీర్‌, సునిల్‌ ఛెత్రీలకు పద్మశ్రీ..

March 16, 2019

2019 పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గ్రహీతలకు ప్రదానం చేశారు.  ఈ సంవత్సరానికి గాను మొత్తం 112 మందిని ఎంపిక చేశారు. ఈ నెల 11వ తేదీన 47 మందికి అవార్డులు అందజేశారు. మిగతావారికి శనివారం రాష్ట్రపతి భవన్‌లో అవార్డులను అందజేయనున్నారు.

Gautam Gambhir honored with Padma Shri, President Kovind Award

అవార్డులు అందుకున్న వారిలో జానపద గాయని తీజన్ బాయి (పద్మవిభూషణ్), ఇస్రో శాస్తవేత్త నంబి నారాయణ్ (పద్మభూషణ్), మహాశయ్ ధరంపాల్ గులాటి (పద్మభూషణ్), పర్యతారోహకురాలు బచెంద్రిపాల్ (పద్మభూషణ్), ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (పద్మశ్రీ), స్వపన్ చౌధురి(పద్మశ్రీ), భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునిల్ ఛెత్రి (పద్మశ్రీ), ఆర్చర్ బంబాయ్‌లా దేవి లైశ్రయ్ (పద్మశ్రీ), మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (పద్మశ్రీ), హెచ్ ఎస్ ఫూల్కా (పద్మశ్రీ) లభించింది.