బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇంట్లో చోరీ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇంట్లో చోరీ

May 29, 2020

Gautam Gambhir

లాక్ డౌన్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు బయటికి రాకపోవడాన్ని ఆసరాగా తీసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంటి బయట ఉన్న వస్తువులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ ఇంట్లో చోరీ జరిగింది.

ఢిల్లీలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉన్న గంభీర్ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆయన తండ్రి ఫర్చూనర్ కారును దొంగలు ఎత్తుకెళ్లారు. కారును తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ కారును గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఘటనపై గౌతమ్ గంభీర్ తండ్రి దీపక్ గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.