గంభీర్‌కు సెల్యూట్.. 100 మంది అమరుల పిల్లల సంరక్షణ - MicTv.in - Telugu News
mictv telugu

గంభీర్‌కు సెల్యూట్.. 100 మంది అమరుల పిల్లల సంరక్షణ

October 14, 2019

Gautam Gambhir's  .

దేశానికి రక్షణ కల్పిస్తున్న జవాన్ల కుటుంబాల భద్రత విషయం ఎవరికి పట్టాలి? వారు పోయాక వారి భార్యాపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఈనేపథ్యంలో వారి పిల్లలకు అండగా నిలబడాలని భారత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు గౌతం గంభీర్‌ భావించారు. అమర జవాన్ల పిల్లల సంరక్షణ బాధ్యతను తీసుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. తన పేరుతో నడుస్తోన్న గంభీర్‌ ఫౌండేషన్‌ తరపున వందమంది చిన్నారుల సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

‘అమరులైన జవాన్లకు చెందిన వంద మంది పిల్లల సంరక్షణ బాధ్యతలను గౌతం గంభీర్‌ ఫౌండేషన్‌ తీసుకుంటోంది. ఈ విషయాన్ని నేనెంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. గౌతం గంభీర్‌ ఫౌండేషన్‌కు శుభాకాంక్షలు. వారి తల్లిదండ్రులు దేశం కోసం వారి జీవితాలను త్యాగం చేశారు. ఇప్పుడు వారి పిల్లలను మనం ఆదుకుని వారి పట్ల మన గొప్ప బాధ్యతను నిర్వర్తిద్దాం’ అని తెలిపారు. గంభీర్ ఫౌండేషన్ అమరులైన దేశ సైనికుల పిల్లలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. వారికి విద్యను అందించడానికి నగదు సాయం అందిస్తోంది. అదేవిధంగా 15 నుంచి 18 ఏళ్లలోపు బాలికలకు వారి సామాజిక, ఆర్థిక మెరుగుదలను ప్రోత్సహిస్తూ అవగాహన కల్పిస్తోంది. కాగా, గంభీర్‌ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.