గౌతమ్‌రెడ్డి భౌతికకాయం వద్ద.. వైసీపీ నాయకుల నవ్వులు - MicTv.in - Telugu News
mictv telugu

గౌతమ్‌రెడ్డి భౌతికకాయం వద్ద.. వైసీపీ నాయకుల నవ్వులు

February 21, 2022

ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో సోమవారం ఉదయం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటి నాయకులు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియాలో స్పందించారు. ”ఒక పక్కన తమ సహచర మంత్రి శవం ఉండగా, మరోపక్క మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ వెకిలి జోకులు వేసుకుంటున్నారు. కేవలం 49 ఏళ్ల వయసులో హఠాత్తుగా చనిపోయాడన్న బాధ ఏమాత్రం లేకుండా ఎలా నవ్వుకుంటూ ఉన్నారో చూడండి” అని అందుకు సంబంధించిన వీడియోను కూడా అయ్యన్నపాత్రుడు ట్విటర్‌లో షేర్ చేశారు.